ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ
నాలుగు వారాల శిక్షణలో భాగంగా మండల పరిపాలనపై క్షేత్రస్థాయి అధ్యయనం
ఎల్కతుర్తి (హనుమకొండ జిల్లా): ఐఏఎస్ శిక్షణలో భాగంగా ఎల్కతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయ ఇన్చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నాలుగు వారాల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతూ మండల పరిపాలనకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందనున్నారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సదానందం పుష్పగుచ్ఛం అందజేసి రోహిత్‌కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు, శనిగరపు వెంకటేష్, కే. మహేశ్వర చారి ఐఏఎస్ అధికారి రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నాలుగు వారాల శిక్షణ కాలంలో మండల పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ వ్యవహారాలు వంటి అంశాలపై రోహిత్ క్షేత్రస్థాయిలో అవగాహన పెంపొందించుకోనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ప్రజలకు అందించే సేవలు, పరిపాలనా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ శిక్షణ దోహదపడనుంది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఐఏఎస్ అధికారి రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.