BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 February 2026, 05:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఐసీడీఎస్ బాల రక్షణ శాఖకు అప్పగింపు

తెలంగాణ
11 Feb, 2026 - 05:26 AM
233 వీక్షణలు
నడవలేని స్థితిలో ఉన్న బాలుడిని ఐసీడీఎస్ బాల రక్షణ శాఖకు అప్పగింపు NTODAY NEWS:  బీబీనగర్ ప్రతినిధి – బాల్ద భాస్కర్ కురుమ కొండమడుగు మెట్టు సమీపంలో అంగవైకల్యం కలిగిన ఓ బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. వంటిపై గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న బాలుడిని గమనించిన గ్రామ యువకులు భాను, వీరేష్ వెంటనే గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉపసర్పంచ్ శ్రీధర్ వార్డు సభ్యులు కనకాబోయిన కిషోర్, మంద భాస్కర్, కడెం కిరణ్, కడెం అశోక్‌లతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి పరిస్థితిని పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న బాలుడికి స్నానం చేయించి, కొత్త దుస్తులు వేయించారు. అనంతరం గ్రామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. డాక్టర్ శ్రవణ్ కుమార్ సహకారంతో బాలుడిని ఐసీడీఎస్ జిల్లా బాల రక్షణ సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. బాలుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ దేశం శ్రీనివాస్ గౌడ్, బాలబోయిన సురేష్, వర్ణాల బలరాజ్, పద్మ చంద్ర ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. #ChildRescue #ICDS #ChildProtection #HumanityFirst #SocialResponsibility #Bhongir #BBNagar #CommunitySupport Follow us on Website Facebook Instagram YouTube