మరోసారి అవకాశం కల్పిస్తే కనిగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తా: పులి శాంతి
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతి నామినేషన్
కనిగిరి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పులి శాంతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీ ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని కోరారు.
గతంలో ఐదేళ్లపాటు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం తనకు ఉందని పులి శాంతి తెలిపారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే మున్సిపల్ చైర్మన్గా కనిగిరిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు.