BREAKING
thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు
మంచి మాట
Date of Publish : 26 October 2026, 04:30 pm
Posted by : KADARI RAMANA

ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలి!

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana Nirmal Rural
26 Oct, 2026 - 04:30 PM
13 వీక్షణలు
  • జిల్లా కలెక్టర్‌కు ఆప్ నాయకుడు సయ్యద్ హైదర్ వినతి..
  • బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

నిర్మల్ (ఎన్‌ టుడే న్యూస్‌): నిర్మల్ పట్టణంలోని చారిత్రక ధర్మసాగర్ చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు.

చెరువు పరిధిలో నిర్మాణాలపై ఆందోళన

ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. ధర్మసాగర్ చెరువు పరిధిలోని సర్వే నంబర్లు 2031, 2032లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాకాలంలో చెరువులోకి వచ్చే నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడితే సమీప నివాస ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగి ప్రజల ప్రాణ, ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చారిత్రక చెరువులను పరిరక్షించడం, వాటి పరిధిలో ఆక్రమణలను అరికట్టడం అధికారుల బాధ్యత అని అన్నారు.

క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలి

సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలని సయ్యద్ హైదర్ కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే పనులను నిలిపివేసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ధర్మసాగర్ చెరువు పరిరక్షణకు జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.