BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాహనీ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:14 PM
11 వీక్షణలు
  • ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆర్డీఓ ఏ. కుమార్ 

తిరువూరు, అక్టోబర్ 25: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ పరిశీలించారు. తిరువూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తొలుత ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కొన్ని కారణాల దృష్ట్యా వాహనీ కాలేజీకి మార్చడంతో, అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఎన్నికల సామగ్రిని భద్రపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు, ఓట్ల లెక్కింపు కేంద్రంలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లను పూర్తి చేయాలని, కౌంటింగ్ హాల్‌లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల విధులను అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తిరువూరు మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆర్డీఓ ఏ. కుమార్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో తిరువూరు మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఎన్నికల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.