జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
- భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
- బ్యాలెట్ బాక్సులకు పటిష్ఠ రక్షణ కల్పించాలని అధికారులకు ఆదేశాలు
- నిరంతర సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలి
- పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలి
నరసరావుపేట, పల్నాడు జిల్లా | ఎన్ టుడే న్యూస్: నరసరావుపేటలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్, జిల్లా ఎస్పీతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులు, పోలీసు బందోబస్తు, రాకపోకల మార్గాలు, ఇతర ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు సూచించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర సీసీటీవీ నిఘా ఉండేలా చూడాలని, పటిష్ఠమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.