నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్
నియామకంపై హర్షం వ్యక్తం చేసిన వివిధ గ్రామాల వార్డు మెంబర్లు
నాంపల్లి | ఎన్ టుడే న్యూస్: నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్ అధ్యక్షుడిగా మహ్మదాపురం గ్రామానికి చెందిన జక్కల శివ యాదవ్ నియమితులయ్యారు. శనివారం నాంపల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఫోరం మండల కమిటీ నియామకాలలో భాగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, ఫోరం కమిటీ సభ్యులు జక్కల శివ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
యూత్ అధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఫోరం నాయకులు, కమిటీ సభ్యులకు జక్కల శివ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. యువతను ఐక్యంగా ముందుకు నడిపిస్తూ వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తనకు ఈ అవకాశం కల్పించిన ఫోరం నాయకులకు, కమిటీ సభ్యులకు, నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.