BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 07:27 pm
Posted by : V శ్రీనివాస్

​జూట్ బ్యాగుల తయారీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 07:27 PM
152 వీక్షణలు

​జూట్ బ్యాగుల తయారీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ​– లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటీఐ) మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 14 రోజుల జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా వయోజన విద్యా అధికారి శ్రీనివాస్, ఆర్‌సెటీఐ సంచాలకులు ఆశిష్ వార్లే, కార్మల్ పాఠశాల ప్రిన్సిపల్ సారూప్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ఎల్‌డీఎం తిరుపతి మాట్లాడుతూ.. జూట్ ఉత్పత్తుల రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 14 రోజుల పాటు సాగే ఈ శిక్షణలో జూట్ బ్యాగుల తయారీ సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలు, ముడిసరుకుల ఎంపికతో పాటు మార్కెటింగ్ మెళకువలు, వ్యాపార నిర్వహణపై ప్రత్యేక శిక్షకులచే అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు స్వయం ఉపాధి సాధించేందుకు బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సెటీఐ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు