BREAKING
thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
Date of Publish : 02 September 2026, 10:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 10:32 AM
91 వీక్షణలు

వాణిజ్య వినియోగదారులకు ఊరట.. 19 కిలోల సిలిండర్‌పై రూ.206 తగ్గింపు

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ.206 మేర ధరను తగ్గించింది. ఈ తగ్గింపు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.

తాజా ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలకు కొంత ఊరట లభించనుంది. వంటగ్యాస్‌పై అయ్యే ఖర్చు తగ్గడంతో వ్యాపార నిర్వహణ వ్యయాలు కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. ఇంట్లో వంటకు ఉపయోగించే గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గత నెలలో అమల్లో ఉన్న ధరే కొనసాగుతోంది.

వాణిజ్య గ్యాస్ ధరలను చమురు సంస్థలు సాధారణంగా నెలవారీగా సవరిస్తుంటాయి. ఈసారి 19 కిలోల సిలిండర్ ధరను తగ్గించడంతో వాణిజ్య వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.