BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొమ్మిరెడ్డిపల్లిలో ఆపదలో అండగా ఎమ్మెల్యే కొలికపూడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:20 PM
7 వీక్షణలు

కంటి శస్త్రచికిత్సకు రూ.80 వేల ఆర్థిక సహాయం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వార్తా విలేకరి మారేపోగు రవికి కంటి శస్త్రచికిత్స నిమిత్తం శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు తన సొంత నిధుల నుంచి రూ.80 వేల ఆర్థిక సహాయం అందించారు.

కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న రవికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చికిత్స ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మానవతా దృక్పథంతో స్పందించారు. చికిత్సకు అవసరమైన రూ.80 వేల మొత్తాన్ని అందించి రవికి అండగా నిలిచారు.

ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయాన్ని అందించడం ద్వారా ప్రజా ప్రతినిధిగా సామాజిక బాధ్యతను చాటుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించడం రవి కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు.

కంటి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై రవి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కొలికపూడి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. రవి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.