కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లమోతు తేజస్వి నామినేషన్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
కొండపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి జోగి రమేష్ ఆశీస్సులతో కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లమోతు తేజస్వి సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు జోగి రాజీవ్, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, ఇబ్రహీంపట్నం మండల మాజీ ఎంపీపీ పాలడుగు జోష్న, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాష్, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లమోతు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.