కుంగ్‌ఫూ క్రీడాకారుడు బెల్లం అజయ్‌కు ఘన సత్కారం
జాతీయ స్థాయిలో ప్రతిభ.. ‘గ్లోబల్ ఎక్స్‌లెన్స్ ఐకాన్ అవార్డు–2026’కు ఎంపిక
కొంతమూరు | Ntoday News
తూర్పుగోదావరి జిల్లా కొంతమూరుకు చెందిన యువ కుంగ్‌ఫూ క్రీడాకారుడు బెల్లం అజయ్కు అరుదైన గౌరవం దక్కింది. కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని GSH జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అజయ్.. జాతీయ స్థాయిలో కుంగ్‌ఫూ క్రీడలో ప్రతిభ కనబరుస్తూ, వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాణిస్తున్నాడు.
అజయ్ ప్రతిభను గుర్తించిన SHAOLIN KUNG FU ACADEMY ఆధ్వర్యంలో నిర్వహించిన GLOBAL EXCELLENCE ICON AWARDS–2026కు ఎంపిక చేశారు.
ఈ అవార్డును 2026 సెప్టెంబర్ 4న ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా అజయ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అజయ్‌ను ఘనంగా సత్కరించిన సుమన్.. కుంగ్‌ఫూ రంగంలో అతను సాధిస్తున్న విజయాలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు
అజయ్ సాధించిన ఘనతపై దోసకాయలపల్లి GSH జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు అభినందనలు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ కళాశాలకు, కొంతమూరు గ్రామానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమన్నారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.