BREAKING
thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
Date of Publish : 17 October 2026, 04:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దివ్యాంగుల పింఛన్ అర్హతలో కీలక మార్పులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 04:48 PM
7 వీక్షణలు

80 శాతం నుంచి 40 శాతానికి వైకల్య పరిమితి తగ్గింపు.. పుట్టుకతోనే పింఛన్‌కు అవకాశం

న్యూఢిల్లీ: దివ్యాంగుల పింఛన్ అర్హత నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP)ను 2026–27 నుంచి 2030–31 వరకు మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ఐదేళ్ల కాలానికి రూ.53,428 కోట్ల నిధులు కేటాయించింది.

దివ్యాంగుల పింఛన్‌కు ఇప్పటివరకు ఉన్న 80 శాతం వైకల్య పరిమితిని 40 శాతానికి తగ్గించింది. కనీస వయోపరిమితి నిబంధనను తొలగించి, అర్హత కలిగిన దివ్యాంగులకు పుట్టినప్పటి నుంచే పింఛన్ పొందే అవకాశం కల్పించింది. ఈ మార్పులతో దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

సవరించిన నిబంధనల ప్రకారం 0 నుంచి 79 ఏళ్ల వయసు గల దివ్యాంగులకు నెలకు రూ.375, 80 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.625 ఆర్థిక సాయం అందించనున్నారు. కొత్త అర్హత నిబంధనలు, లబ్ధిదారుల సంఖ్య, ఆర్థిక సాయానికి సంబంధించిన మార్గదర్శకాలను మూడు నెలల్లోగా జారీ చేసి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నిర్ణయంతో గతంలో అధిక వైకల్య శాతం నిబంధన కారణంగా పింఛన్‌కు అర్హత పొందలేని పలువురికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే, వ్యక్తిగత అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాత స్పష్టమవుతాయి.