BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మంలో ఏఆర్ కానిస్టేబుల్‌పై వివాహిత భర్త ఫిర్యాదు.. అక్రమ సంబంధం ఆరోపణలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
100 వీక్షణలు

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై ఓ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు.

కోర్టు కేసు విచారణ నిమిత్తం వచ్చిన తన భార్యకు కానిస్టేబుల్ రాంబాబు పరిచయమయ్యాడని, చెల్లి, బుజ్జి అంటూ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని ఆరోపించాడు.

భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో నిఘా పెట్టిన భర్త.. కానిస్టేబుల్‌తో తన భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో పట్టుకున్నట్లు తెలిపాడు. గతంలో ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు కూడా తన భార్య ఫోన్‌లో లభించాయని పేర్కొన్నాడు.

తనను పట్టుకున్న సమయంలో కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితుడు ఆరోపించాడు. పదేళ్ల ప్రేమ వివాహం, ఇద్దరు పిల్లలు ఉన్న తన కుటుంబాన్ని దెబ్బతీసేలా కేసు విషయంలో వచ్చిన మహిళను కానిస్టేబుల్ ఇలా ప్రలోభాలకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.