గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా కిమిడి సంధ్య నామినేషన్
- విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి
- అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
- అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి
- కూటమి అభ్యర్థి విజయానికి సమష్టి కృషి
విజయనగరం | ఎన్ టుడే న్యూస్: విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కిమిడి సంధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని కూటమి నాయకులు పేర్కొన్నారు.
గరివిడి మండల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థి కిమిడి సంధ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“మన గ్రామం.. మన ప్రజలు.. మన అభివృద్ధి!” అనే నినాదంతో కూటమి శ్రేణులు ముందుకు సాగాలని నాయకులు పేర్కొన్నారు.