సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి
సంతకవిటి: రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సంతకవిటి మండల జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల అప్పలనాయుడు సతీమణి కొల్ల జ్యోతిర్మయి పోటీ చేయనున్నారు. టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
కోళ్ల అప్పలనాయుడు గతంలో నాలుగు సార్లు ఎంపీపీగా, ఒకసారి జెడ్పీటీసీగా పనిచేశారు. అలాగే తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు స్థానిక రాజకీయాల్లో ఉన్న అనుభవం నేపథ్యంలో సంతకవిటి జెడ్పీటీసీ స్థానానికి కొల్ల జ్యోతిర్మయి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంతకవిటి మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.