కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి
నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి న్యాయం చేయాలి
శ్రీకాళహస్తి | ఎన్ టుడే న్యూస్: బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ సమాజానికి చెందిన కోట చంద్రశేఖర్‌కు రాజకీయంగా అవకాశం కల్పించాలని ఆ వర్గానికి చెందిన నాయకులు, ప్రతినిధులు కోరుతున్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రశేఖర్‌కు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి పరిశీలించాలని విజ్ఞప్తి
శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయించిన నేపథ్యంలో కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించడం ద్వారా నాయి బ్రాహ్మణ సమాజానికి తగిన గుర్తింపు లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాజిక సేవతోపాటు నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం ముందుండే వ్యక్తిగా చంద్రశేఖర్‌కు అవకాశం ఇస్తే, ఆ వర్గం సమస్యలను పాలకుల దృష్టికి మరింత సమర్థంగా తీసుకెళ్లగలరని పేర్కొంటున్నారు.
చంద్రశేఖర్‌కు అవకాశం.. సమాజానికి గుర్తింపు
కోట చంద్రశేఖర్‌కు లభించే అవకాశం ఒక్క వ్యక్తికి దక్కే పదవిగా కాకుండా, నాయి బ్రాహ్మణ సమాజానికి లభించే రాజకీయ గుర్తింపుగా చూడాలని నాయకులు కోరుతున్నారు. వృత్తిపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడంతోపాటు విద్య, ఉపాధి, వృత్తి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేందుకు సమర్థ నాయకత్వం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే చొరవ చూపాలి
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి నాయి బ్రాహ్మణుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించేలా చొరవ చూపాలని ఆ వర్గం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణులకు కూడా తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షిస్తున్నారు.
“కోట చంద్రశేఖర్‌కు అవకాశం ఇవ్వాలి.. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలి.. నాయి బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి!” అని నాయకులు నినదించారు.