నరసింహారావుపాలెం–సి.గుడిపాడు ఎంపీటీసీకి టీడీపీ అభ్యర్థిగా కోట పూజిత నామినేషన్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం నరసింహారావుపాలెం–సి.గుడిపాడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోట పూజిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కట్టా నాగ దుర్గా రావు, బీజేపీ నాయకుడు విద్యాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.