బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
నారాయణపూర్
దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి
సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్: సంస్థాన్ నారాయణపురం మండల బీజేపీ అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ బాబాయ్, అల్లందేవిచెరువు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్య దశదిన కర్మ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జంగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జంగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.
పాల్గొన్న బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరి వీరారెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి జక్కలి రాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వంగరి రఘు, జిల్లా నాయకులు భాస్కర్ నరసింహ, జక్కర్తి భిక్షం, సర్వేలు గ్రామ ఉపసర్పంచ్ కట్కూరి భాస్కర్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.