పోలింగ్కు 48 గంటల ముందే మద్యం దుకాణాల మూసివేత
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందే మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ నిబంధన అమలు చేయనున్నారు. ఈ నెల 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించినట్లు పేర్కొంది. మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా తెరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.