BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 27 February 2026, 09:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హనుమంత వాహనంపై కోదండ రాముడి చిద్విలాసం

తెలంగాణ
27 Feb, 2026 - 09:33 AM
331 వీక్షణలు
హనుమంత వాహనంపై కోదండ రాముడి చిద్విలాసం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు వైభవంగా కొనసాగుతున్న పుంగనూరు బ్రహ్మోత్సవాలు పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి ఉత్సాహాలతో కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు సాయంత్రం స్వామివారు కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహనానికి ముందు మంగళ వాయిద్యాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన కోలాట బృందాల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అంతా భక్తి శ్రద్ధల మధ్య శ్రావణానందకరంగా సాగింది. ఉదయం, సాయంత్రం ఆలయంలో విశేష హోమ కార్యక్రమాలు నిర్వహించగా, పురవాసులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులకు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. గోవింద నామాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శనివారం కార్యక్రమాలు ఉదయం: మోహినీ ఉత్సవం రాత్రి: శ్రీవారి గరుడ సేవ — కృష్ణ మూర్తి ఆలయ ఇన్స్పెక్టర్ #Punganur #Brahmotsavam #HanumanthaVahanam #KodandaRama #TempleFestival #AnnamayyaDistrict Follow us on Website Facebook Instagram YouTube