BREAKING
thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 21 October 2026, 02:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీ, తమిళనాడుకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 02:38 PM
25 వీక్షణలు

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని మీనంబాకంలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, నుంగంబాకంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. మరోవైపు ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో నేడు పోలవరం, కోనసీమ, మార్కాపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైతులు, ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.