BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 04 September 2026, 06:58 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Sep, 2026 - 06:58 PM
38 వీక్షణలు

లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌–2026లో కీలకోపన్యాసానికి ఆహ్వానం

హైదరాబాద్ | Ntoday News

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక నుంచి ఆహ్వానం అందింది. యూరప్‌లో స్టార్టప్‌లు, వెంచర్‌ క్యాపిటల్‌, పెట్టుబడుల రంగాలకు సంబంధించిన ప్రముఖ కార్యక్రమమైన లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌–2026లో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించారు.

లక్సెంబర్గ్‌లో అక్టోబర్‌ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి Luxinnovation, Luxembourg Private Equity and Venture Capital Association (LPEA) తరఫున కేటీఆర్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం.

ఆసియా, యూరప్‌ దేశాల్లో పెట్టుబడుల విధానాల మధ్య తేడాలు, పెట్టుబడిదారుల రిస్క్‌ తీసుకునే ధోరణి, స్టార్టప్‌ వ్యవస్థాపకుల అంచనాలు, పెట్టుబడి అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సెషన్‌లో కేటీఆర్‌ మాట్లాడాలని నిర్వాహకులు కోరినట్లు తెలుస్తోంది.

భారత్‌ను అంతర్జాతీయ పెట్టుబడులు, ఆవిష్కరణల వ్యవస్థలతో అనుసంధానించడంలో కేటీఆర్‌కు ఉన్న అనుభవం యూరప్‌లోని పెట్టుబడిదారులు, స్టార్టప్‌ వ్యవస్థాపకులకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తమ ఆహ్వానంలో పేర్కొన్నట్లు సమాచారం. భారత్‌–అంతర్జాతీయ మార్కెట్ల మధ్య పెట్టుబడి సంబంధాలను పెంపొందించడంలో ఆయన దృక్పథం కీలకమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

28 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు

యూరప్‌లోని ప్రముఖ పెట్టుబడిదారులు, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సు ప్రధానంగా స్టార్టప్‌ ఫైనాన్సింగ్‌, వ్యాపార వృద్ధి అంశాలపై దృష్టి సారిస్తుంది.

గత ఏడాది జరిగిన లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌కు 28 దేశాల నుంచి 3,400 మందికి పైగా ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. ఇందులో 300 మందికి పైగా పెట్టుబడిదారులు, 110 వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. European Investment Fund, NATO Innovation Fundతో పాటు యూరప్‌కు చెందిన పలు ప్రముఖ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఈ ఏడాది సదస్సులో European Business Angel Network వార్షిక సమావేశంతో పాటు NATO Innovation Fundతో కలిసి నిర్వహించే Defence Venture Day, యూరప్‌లోని స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, ఫ్యామిలీ ఆఫీసులు, విధాన నిర్ణేతలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులతో కేటీఆర్‌ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్టార్టప్‌ రంగాలకు సంబంధించిన అంశాలపై కేటీఆర్‌కు వరుసగా లభిస్తున్న ఆహ్వానాల్లో లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌–2026 ఆహ్వానం మరో ముఖ్యమైన సందర్భంగా నిలిచింది.