BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 05:27 pm
Posted by : కూనురు మధు

మానవత్వం చాటుకున్న బాల్య మిత్రులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
07 Jun, 2026 - 05:27 PM
414 వీక్షణలు

దివంగత స్నేహితుడి కుటుంబానికి ₹67 వేల ఆర్థిక సాయం

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి తమ పాత జ్ఞాపకాలను, స్నేహ బంధాన్ని చాటుకున్నారు పెద్దకాపర్తి జెడ్పీహెచ్ఎస్  1989-90 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు చిన్నకాపర్తి గ్రామానికి చెందిన లోడే విష్ణుమూర్తి గత నెల (మే 21) అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన చిన్ననాటి స్నేహితులు (పూర్వ విద్యార్థుల బ్యాచ్) తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం (జూన్ 7న) విష్ణుమూర్తి నివాసానికి వెళ్లిన స్నేహితులు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర సానుభూతిని తెలియజేశారు. కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, విష్ణుమూర్తి కుటుంబానికి మేమున్నామంటూ పూర్వ విద్యార్థులంతా కలిసికట్టుగా రూ. 67,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని, విష్ణుమూర్తి పిల్లల చదువుల నిమిత్తం పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు భరోసానిచ్చారు. స్నేహితుడి కుటుంబం పట్ల వారు చూపిన ఈ మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు. తమతో పాటు స్నేహితులు తోడుగా ఉన్నందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు స్నేహమేరా జీవితం అనే నినాదానికి అర్థం చెప్పారని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విష్ణుమూర్తి చిన్ననాటి స్నేహితులు బుంగపట్ల తిమ్మయ్య, కేసాని సత్తి రెడ్డి, గురిజ జంగయ్య, కంచర్ల వెంకట్ రెడ్డి, నారాయణ ఆనంద్, నారాయణ ప్రసాద్, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, మారగోని యాదగిరి, మామడి లక్ష్మి నారాయణ, నాశబోయిన శ్రీను, నాకరేకంటి కృష్ణ, నర్సింహా, కునూరు యాదగిరి, వడ్డేపల్లి మంగమ్మ, ఉప్పరబోని ఇందిరమ్మ, పొట్లపల్లి పద్మ, కోమటిరెడ్డి మంజుల తదితరులు పాల్గొన్నారు.