BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 31 August 2026, 08:46 am
Posted by : DAVU RAVINDER REDDY

మారుతి సుజుకి కార్లపై ఆఫర్ల వర్షం. ..చివరి 4 రోజులే ఛాన్స్.

జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
31 Aug, 2026 - 08:46 AM
10 వీక్షణలు

 మారుతి సుజుకి కార్లపై ఆఫర్ల వర్షం. ..చివరి 4 రోజులే ఛాన్స్.

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకి తన విక్రయాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ భారీ ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లతో పాటు కార్పొరేట్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్లలు కలుపుకుని కస్టమర్లకు భారీగా పొదుపు చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. అయితే ఈ మైండ్ బ్లోయింగ్ ఆఫర్లను సొంతం చేసుకోవడానికి

కొనుగోలుదారులకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. స్టాక్ లభ్యతను బట్టి డిస్కౌంట్ వివరాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున కస్టమర్లు తమ సమీప షోరూమ్ను వెంటనే సంప్రదించాలని కంపెనీ కోరుతోంది.

ఇన్విక్టో, విక్టోరిస్పై ఏకంగా రూ.1.55 లక్షల ఆదా

మారుతి లైనప్లో అత్యంత ప్రీమియం ఎంపీవీగా పేరుగాంచిన ఇన్విక్టో మోడల్పై కస్టమర్లు గరిష్ఠంగా రూ.1.55 లక్షల వరకు ఊహించని లబ్ది పొందవచ్చు. 2.0 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్తో వచ్చే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.25.21 లక్షల నుంచి ఆరంభమై రూ.28.92 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు మారుతి విక్టోరిస్ కారుపై కూడా ఏకంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపు దక్కుతోంది. 1.5 లీటర్ పెట్రోల్, మైల్డ్ అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆరంభ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్యలో ఉంది.

గ్రాండ్ విటారా కళ్లు చెదిరే తగ్గింపు

ఎస్ూవీ విభాగంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న గ్రాండ్ విటారా కొనుగోలుపై కస్టమర్లు రూ.1.30 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్, 3- సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లతో పాటు సిఎన్ఆ ఐచ్ఛికంలోనూ ఈ మోడల్ అందుబాటులో ఉంది. సుదీర్ఘ ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉండే ఈ ఎస్యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు ఉండి కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వ్యాగనార్, ఆల్టో K10 లపై అదిరిపోయే బెనిఫిట్స్

మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత చేరువైన మారుతి వ్యాగనార్ హాచ్బ్యాక్పై రూ.52,500 వరకు ఆదా చేసుకునే ఛాన్స్ లభిస్తోంది. 1.0 లీటర్, 1.2 లీటర్ కే-సిరీస్ పెట్రోల్ తో పాటు సిఎన్ఎ వేరియంట్లలో వస్తున్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.545 లక్షల నుంచి మొదలై రూ.7.38 లక్షల వరకు ఉంది. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన బడ్జెట్ కారు ఆల్టో K10 పై కూడా రూ.52,500 వరకు డిస్కౌంట్ వర్తిస్తోంది. 1.0 లీటర్ కే10సి పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న ఈ మోడల్ ధర రూ.3.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.5.96 లక్షల వరకు మార్కెట్లో

అందుబాటులో ఉంది.