BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో శ్రీనిధి డిగ్రీ కళాశాలలో దివిస్ లాబొరేటరీస్ ఉద్యోగ ఇంటర్వ్యూలు విజయవంతం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 04:50 PM
57 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిరలోని శ్రీనిధి డిగ్రీ కళాశాలలో దివిస్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తయ్యాయి.

కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, విద్యార్థినులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ దశల్లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు దివిస్ లాబొరేటరీస్ ప్రతినిధులు తెలిపారు.

ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వై. అనిల్ కుమార్ నెహ్రూ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా శ్రీనిధి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యోగ మేళాలు, ప్రాంగణ నియామక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మధిర ప్రాంతంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్న కళాశాలల్లో శ్రీనిధి డిగ్రీ కళాశాల ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.