BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 08:28 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
17 Oct, 2026 - 08:28 PM
4 వీక్షణలు

మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

విజయవాడ, అక్టోబర్ 17 (ఎన్ టుడే న్యూస్): ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం మోహన్ యాదవ్ అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ తదితరులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని మోహన్ యాదవ్‌కు అందజేశారు.