జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిత్వానికి మాగంటి బాబు దంపతుల దరఖాస్తు
పంచమర్తి అనూరాధను మర్యాదపూర్వకంగా కలిసిన మాగంటి బాబు, పద్మవల్లి ఏలూరు, అక్టోబరు 17: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిత్వం కోసం మాజీ మంత్రి మాగంటి బాబు, పద్మవల్లి దంపతులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, పలువురు కూటమి నాయకుల సమక్షంలో జిల్లా ఇన్చార్జి పంచుమర్తి అనూరాధను మాగంటి బాబు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని అన్ని వర్గాల్లో మాగంటి కుటుంబానికి ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిత్వానికి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా తమ అభ్యర్థిత్వానికి పార్టీ నాయకత్వం మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. మాగంటి బాబు దంపతుల వెంట పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు.