BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 11:13 pm
Posted by : NAGARAJU GADE

రెండు జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థిగా మజ్జి సిరిసహస్ర నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
23 Oct, 2026 - 11:13 PM
15 వీక్షణలు

కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా: సిరిసహస్ర

బేబీనాయన, కోళ్ల లలితకుమారి, తెంటు లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో పత్రాల సమర్పణ

విజయనగరం జిల్లా: జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె మజ్జి సిరిసహస్ర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కొత్తవలస, తెర్లాం మండలాల జెడ్పీటీసీ స్థానాలకు ఆమె నామినేషన్లు సమర్పించారు.

బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో సిరిసహస్ర సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తవలస, తెర్లాం మండలాల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు.

నామినేషన్ల అనంతరం సిరిసహస్ర మాట్లాడుతూ తన తండ్రి చిన్న శ్రీను చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.