తిరువూరు మున్సిపల్ అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి
- సీపీఐ, సీపీఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా): తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ, సీపీఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి నల్లమోలు శ్రీనివాసరావు, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గంధం శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తిరువూరు మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరుతూ, చైర్‌పర్సన్ అభ్యర్థి నల్లమోలు శ్రీనివాసరావుతో పాటు 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గంధం శ్రీనివాసరావును గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థులకు విజయాన్ని అందించాలని నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కోరారు.