BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 03:07 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 03:07 PM
115 వీక్షణలు

​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

మంచిర్యాల:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, సామాజిక న్యాయానికి చిరస్మరణీయ ప్రతీక అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి వినమ్రంగా నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, దేశానికి అంబేద్కరుడు అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నివాళులర్పించారు:

​"జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్"

​"అమర్ హై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అమర్ హై"

​ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, సింగరేణి విశ్రాంత ఉద్యోగులు మరియు అభిమానులు పాల్గొని అంబేద్కర్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు