BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 08:36 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

మర్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, పరిశీలించిన మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Jul, 2026 - 08:36 AM
323 వీక్షణలు

మర్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, పరిశీలించిన మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామంలో ఎస్సీ కాలనీలో శనివారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది.ఈ క్రమంలో ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. గ్రామానికి చెందిన సంగి స్వామి, కమలమ్మ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదగా మారాయి. లక్ష రూపాయలు వస్తువులు కాలిపోగా,నూతనంగా నిర్వహిస్తున్న గృహానికి 2,50,000 అప్పు తీసుకువచ్చి ఇంట్లో పెట్టగా రాత్రి  షార్ట్ సర్క్యూట్ కారణంగా డబ్బులన్నీ కాలిపోయాయని కన్నీరు మున్నీరవుతున్నారు.సమాచారం అందుకున్న మండల తాహాసిల్దార్ పి.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన ఇల్లును పరిశీలించారు ఈ సంఘటనతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.