BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల టికెట్ ఆశతో పెళ్లి.. చివరికి నిరాశే మిగిలింది!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 07:20 PM
40 వీక్షణలు

సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం జనసేనకు కేటాయింపు.. టీడీపీ నేత హర్షవర్ధన్ ఆశలపై నీళ్లు

ఆంధ్రప్రదేశ్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఓ టీడీపీ నేత ముందుగానే పెళ్లి చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో తన ప్రేయసి మంజీరను టీడీపీ నేత హర్షవర్ధన్ హడావుడిగా వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను పెళ్లి చేసుకుంటే తన భార్యకు పార్టీ టికెట్ దక్కుతుందనే ఆశతో, బంధుమిత్రులను పిలవకుండా గుడిలోనే వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం జనసేన పార్టీకి కేటాయించడంతో ఆయన ఆశలు నెరవేరని పరిస్థితి ఏర్పడింది.

హర్షవర్ధన్, మంజీర ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, మరో ఆరు నెలల తర్వాత వివాహం చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికల టికెట్ కోసం ఎదురుచూస్తూ వివాహాన్ని ముందుకు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు సీట్ల సర్దుబాటుతో ఆశించిన అవకాశం దక్కకపోవడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, వివాహం వెనుక ఉన్న కారణాలపై అధికారిక నిర్ధారణ అందుబాటులో లేదు.