BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 18 October 2026, 08:36 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Oct, 2026 - 08:36 PM
7 వీక్షణలు

కలెక్టర్, ఎస్పీతో జనరల్ అబ్జర్వర్ సమీక్ష.. స్వేచ్ఛగా ఓటు వేసేలా పటిష్ట భద్రత

మదనపల్లె: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ జి. బాలకృష్ణ ఆదివారం మదనపల్లె కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు.

ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎన్నికల నిబంధనలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయడంతో పాటు పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ అధికారులకు సూచించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వ శాఖలు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించడం, ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.