ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: కనిగిరి సీఐ సుబ్రహ్మణ్యం
కనిగిరి (ఎన్ టుడే న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని కనిగిరి సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలను వెల్లడించారు.
ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తామని చెప్పారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ సుబ్రహ్మణ్యం కోరారు.