ప్రజాభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
తెలంగాణ
/
హైదరాబాద్
పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులకు హాజరు
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన అంశాలు, సంస్థాగత వ్యవహారాలపై నాయకులు సమావేశమైనట్లు సమాచారం.