సోమాజిగూడ బార్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. రివాల్వర్‌తో బెదిరింపులు
- బార్ బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన యువకుడు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రివాల్వర్, థార్ వాహనం స్వాధీనం
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్:
హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌లో కస్టమర్ల మధ్య తలెత్తిన వాగ్వాదం కాస్తా రివాల్వర్‌తో బెదిరింపులకు దారితీసినట్లు సమాచారం.
బార్‌లో కస్టమర్ల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో బౌన్సర్లు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను రెండో అంతస్తు నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో ఓ యువకుడు తన మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లి రివాల్వర్ తీసుకొచ్చినట్లు సమాచారం. తిరిగి రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు.
దీంతో సెల్లార్‌లో ఉన్న కస్టమర్లు, బౌన్సర్లపై యువకుడు రివాల్వర్ చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బార్ బిల్లుకు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఇవ్వకపోతే కాల్చేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కస్టమర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని మహమ్మద్ షానవాజ్ (24)గా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడు వచ్చిన థార్ వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆయుధానికి సంబంధించిన అనుమతుల వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.