BREAKING
thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
Date of Publish : 17 October 2026, 05:45 pm
Posted by : PEDDABOINA SRIKANTH

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
17 Oct, 2026 - 05:45 PM
3 వీక్షణలు

పలు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి

ఎల్కతుర్తి (హనుమకొండ జిల్లా): మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎల్కతుర్తి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ తల్లి శీలం సాంబాలక్ష్మి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అలాగే మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి కుటుంబాన్ని కలిసి సానుభూతి తెలిపారు.

శ్రీపతి సదానందం తల్లి శ్రీపతి రాజమ్మ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన పీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సైతం మంత్రి కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మంత్రి వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ రావు, ముప్పు మహేందర్, బక్కి శ్రీకాంత్, డాక్టర్ రమేష్ బాబు, హింగే శ్రీకాంత్, బత్తిని రవీందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శనిగరం వెంకటేష్, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.