శారదా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
తెలంగాణ
/
వరంగల్
శృంగేరి శారదాపీఠంలో ప్రత్యేక పూజలు.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన
వరంగల్ (ఎన్ టుడే న్యూస్): వరంగల్లోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా లలితా త్రిపుర సుందరి అలంకారంలో కొలువుదీరిన శ్రీ శారదా అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం ఎనిమిదవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న వారు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.