నూతన రిటైర్మెంట్ కార్మికుల కమిటీకి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభినందనలు
కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించిన ఎమ్మెల్యే
3వ డివిజన్ కార్మిక సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ రిటైర్మెంట్ కార్మికుల నూతన కమిటీ సభ్యులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు బియ్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రంగిశెట్టి రాజయ్య, దేవసాని లింగయ్య, ప్రధాన కార్యదర్శి తెపు కుమారస్వామి, కోశాధికారి కొంతం రాజయ్య, ప్రచార కార్యదర్శులు కర్నే రాజయ్య, వెబ్బటి రాయమల్లు, సహాయ కార్యదర్శులు పెరుమండ్ల రాజేందర్, పుల్యాల రాజశేఖర్, బొమ్మగాని వెంకటి, సలహాదారు పల్లె రాజులను ఎమ్మెల్యే అభినందించారు. నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు, నస్పూర్ పట్టణ ఇన్ఛార్జి నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్ పత్తి ప్రకృతి–వెంకటేష్, 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెర్వెట్ల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ మోతె కనకయ్య, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, మల్లేష్, శివ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.