మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
వలిగొండ
గోపరాజుపల్లిలో ఊదరి దశరథ కుటుంబానికి నగదు అందజేత
యాదాద్రి భువనగిరి: వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఊదరి దశరథ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
సోమవారం గ్రామ సర్పంచ్ సలిగంజి పృథ్వీ ఎమ్మెల్యే పంపించిన రూ.10 వేల నగదును దశరథ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు తమ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సలిగంజి బిక్షపతి, నాయకులు పాలకూర్ల మల్లేశం, చిల్లర స్వామి, నల్లబోలు ధర్మేందర్, పూలగూర్ల నర్సిరెడ్డి, కోమటిరెడ్డి మల్లారెడ్డి, రుద్రపల్లి యాదయ్య, సంగపాక స్వామి, ఊదరి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.