దిల్సుఖ్నగర్ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తెలంగాణ
/
రంగారెడ్డి
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన ఆలయ చైర్మన్, ఈఓ
హైదరాబాద్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దిల్సుఖ్నగర్లోని శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాంచందర్, కార్యనిర్వహణాధికారి స్నేహలత ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తోట మహేష్ యాదవ్, మధుసాగర్, కిరణ్తో పాటు పలువురు పాల్గొన్నారు.