BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 March 2026, 10:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అనాధ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

తెలంగాణ
03 Mar, 2026 - 10:49 AM
405 వీక్షణలు
అనాధ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున వేంపల్లె, మార్చి 03: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వేంపల్లెలోని పాత గండి రోడ్డులో ఉన్న మదర్ థెరిస్సా అనాధ వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకుల సురేష్, ఆకుల వరలక్ష్మి, చరణ్, లోకేష్ ఆకాంక్షించారు. వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అనాధ వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల సురేష్ మాట్లాడుతూ వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు లభించి ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు సింగారెడ్డి శివకృష్ణా రెడ్డి, కమటం హరికుమార్ రెడ్డి, జనసేన నాయకులు దాసరి రవిశంకర్, జనసేన మండల యువ నాయకులు గోసల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. #Vempalle #BuddaRajasekharReddy #BirthdayCelebrations #OldAgeHome #CommunityService Follow us on Website Facebook Instagram YouTube