AI హోలోగ్రామ్ రూపంలో స్వామి చిన్మయానందతో మోదీ సంభాషణ
‘1993లో కలిసిన నువ్వు దేశ ప్రధానిగా ఎదగడం సంతోషంగా ఉంది’
న్యూఢిల్లీ | ఎన్ టుడే న్యూస్: ఢిల్లీలో నిర్వహించిన ‘చిన్మయ అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో స్వామి చిన్మయానంద AI హోలోగ్రామ్ అవతార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన స్వామిజీ అవతార్‌తో మోదీ మాట్లాడారు.
‘నిన్ను దేశ ప్రధానిగా చూడటం సంతోషంగా ఉంది’
వైరల్ అవుతున్న వీడియోలో స్వామి చిన్మయానంద అవతార్.. “నరేంద్రా, నువ్వు నాకు బాగా గుర్తున్నావు. 1993లో నన్ను కలిసిన వ్యక్తి దేశ ప్రధానిగా సేవలందించడం సంతోషంగా ఉంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటావు. ఉపవాసం అని చెప్పకుండా శ్రీ ఖండ్ ప్రసాదం తప్పకుండా తిను” అని చెప్పినట్లు కనిపిస్తోంది.
ప్రసాదం తింటానన్న మోదీ
దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ నవరాత్రులు ముగిశాయని, ప్రసాదం తింటానని చెప్పినట్లు వీడియోలో ఉంది. ఈ వినూత్న AI ప్రదర్శనకు సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.