పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
- ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు
- గుంపులుగా జనాలు గుమికూడకుండా పోలీసుల చర్యలు
- నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా చర్యలు
పులివెందుల | ఎన్ టుడే న్యూస్: పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసరాల్లో జనాలు గుంపులుగా గుమికూడకుండా చర్యలు చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ నామినేషన్ కేంద్రం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.