నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు
అచ్చంపేట (ఎన్ టుడే న్యూస్): పల్నాడు జిల్లా అచ్చంపేట మండల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏ. హరిబాబును ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఎమ్మార్పీఎస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు బయ్యవరపు రోశయ్య మాదిగ సీఐకి శాలువా కప్పి సత్కరించగా, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపు సురేష్ మాదిగ పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఐ హరిబాబు సేవలు మండల ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బయ్యవరపు రోశయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపు సురేష్ మాదిగ, ఎమ్మెస్పీ నియోజకవర్గ నాయకుడు చిలక లక్ష్మయ్య మాదిగ, వేమవరపు కటకయ్య మాదిగ, సంధ్యపోగు వెంకట్రావు మాదిగ, సంధ్యపోగు మహేష్ మాదిగతో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.