పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం!
పులివెందుల పురపాలక ఎన్నికల ప్రచారం పట్టణంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఎన్నికల రణరంగంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులు దూకుడు పెంచుతూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని నగరిగుట్ట ప్రాంతంలో గల వార్డుల్లో కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి తుగుట్ల గీతాకుమారితో పాటు నల్లగారి భాస్కర్ రెడ్డి, నల్లగారి అనురాధ వారి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. నగరిగుట్ట పరిధిలోని నాలుగు వార్డుల్లో వారు గడప గడపకూ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిశారు. సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి, వేయించి,తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి తుగుట్ల గీతాకుమారిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి పనులు,ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు.స్థానికంగా నెలకొన్న తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ,అంతర్గత రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే మున్సిపాలిటీలో కూటమి పాలన రావాలని పేర్కొన్నారు.వార్డుల సర్వతోముఖాభివృద్ధి కూటమి అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు అభ్యర్థులతో పాటు నియోజకవర్గ,పట్టణ స్థాయి టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.