BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 2:14 pm Posted by : NTODAY NEWS

మున్సిపల్ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలి: సీఐటీయూ

పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.30 వేలకు పెంచాలి

అంబర్‌పేట: జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కార్మికులకు దసరా బోనస్ అందించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సీఐటీయూ అంబర్‌పేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని ఎస్‌బీఐ పార్కు సమీపంలో మున్సిపల్ కార్మికులతో కలిసి ‘కార్మిక బతుకమ్మ’ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎం. దశరథ్, నగర ఉపాధ్యక్షుడు జి. రాములు మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోడ్లు శుభ్రం చేస్తూ, నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వారు సేవలందిస్తున్నారని తెలిపారు. కార్మికుల సేవలను సీఐటీయూ నగర కమిటీ అభినందిస్తోందన్నారు.

నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు. ఇంటి అద్దెలు, పాఠశాల ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ, కార్మికులకు అందుతున్న వేతనాలు కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కోరారు.

ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాల సవరణ, బోనస్ వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పటికీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల సవరణ, దసరా బోనస్, పండుగ సెలవులు, క్యాజువల్ సెలవులు కల్పించడం లేదని నాయకులు ఆరోపించారు. నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు తగిన గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు.

తెలంగాణ బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు బోనస్ అందించడంతో పాటు కనీస వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలు పెంచే వరకు వారి పక్షాన సీఐటీయూ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అంబర్‌పేట కార్యదర్శి పి. శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ కార్మికులు అండాలు, జయశ్రీ, మంజుల, లక్ష్మి, రేణుక, స్వాతి, పద్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 15 October 2026, 03:30 pm
Posted by : PAGADALA DEVAIAH

మున్సిపల్ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలి: సీఐటీయూ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
15 Oct, 2026 - 03:30 PM
8 వీక్షణలు