నామినేషన్ కేంద్రం వద్ద బారికేడ్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా చర్యల్లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చాట్రాయి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామకృష్ణ తెలిపారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు, నాయకులు, ప్రజల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భద్రతా పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్‌ఐ డి. రామకృష్ణ వెల్లడించారు.