BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 18 October 2026, 08:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో లోకం సుభిక్షంగా ఉండాలని నగర సంకీర్తన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Oct, 2026 - 08:28 AM
14 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయ ప్రాంగణంలోని షిరిడీ సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగింది. భక్తులు ‘ఓం సాయి, శ్రీ సాయి, జయజయ సాయి’ నామాలతో పాటు గోవింద నామాలను పారాయణం చేస్తూ భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తనలో పాల్గొన్నారు. సత్యసాయి సేవా కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బొడ్రాయి సెంటర్‌లో హనుమాన్ చాలీసా పారాయణం

పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్‌లో ఉన్న ఏకశిలా అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ ప్రసాదాలను నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పర్యవేక్షించారు.